NEE JATHA GA

Rs. 199.00
Sale price  Rs. 199.00 Regular price 
Taxes included.

తనకోసం ఆలోచించని క్షణం లేదు.ఇన్ని రోజులు తన ఆలోచనలో పిచ్చిదాన్ని అయిపోతున్నాను. నాకు నేనే తక్కువ కనబడుతున్నాను. నా కన్నీటి దారలతో నా చేతిలో ఉన్న ఫోను తడిసిపోయింది. తెరలు తెరలుగా వస్తున్న ఏడుపును ఆపుకోవటం నావల్ల కావడం లేదు. కనీసం నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేని ఒంటరిదాన్నా?అనుకుంటూ బెడ్ మీద పడుకుని దిండు ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూనే ఉన్నా. ఎవరూ లేని నాకు నేనున్నానన్నట్టగా కిటికీలోనుంచి ఒకసారిగా వచ్చిన గాలి వల్ల గోడకి తగిలించి ఉన్న నాన్న ఫోటో కదిలిన చప్పుడు వచ్చింది. “ శశి అని నాన్న పిలిచినట్టు అనిపించింది” వెంటనే లేచి నాన్న ఫోటో తెచ్చుకుని గట్టిగా కౌగిలించుకొని మా నాన్నకు నా బాధ వినిపించేలా గుక్క పట్టి ఏడ్చాను. ఎందుకు నాన్న నాకు ఇంత బాధ నన్ను ప్రేమించే నువ్వు వెళ్ళిపోయావు. మళ్లీ ఆ ప్రేమని అర్జున్ చూపిస్తాడేమో వస్తాడేమో అని ఆశ పడుతూ ఎన్ని రోజులు తన మీద ఆశలు పెంచుకుంటూ..తనతో జీవితాన్ని కలలు కంటూ బతికాను. కానీ. తన  సంతోషంగానే ఉన్నానని తేల్చి చెప్పేశాడు. అంటే తన జీవితంలో నేను లేకపోయినా సంతోషంగా ఉంటాడనే కదా. 

NEE JATHA GA

NEW TELUGU LOVE NOVEL

HEART TOUCHING LOVE STORY

INTENSE LOVE STORY

NEW

Pairs well with